ఓటు వేసి వస్తుండగా తనపై దాడి చేశారని కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న వాగ్వాదాన్ని వద్దన్నందుకు వేణుగోపాల్ రెడ్డి, పుల్లయ్య, మద్దిలేటి అనే వ్యక్తులు దూషించి దాడి చేసినట్లు ఆమె తెలిపింది. గోస్పాడు పోలీసు స్టేషన్లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: