కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం అలేబాద్ తండాలో ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తే చంపినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రవినాయక్, బేతంచెర్ల మండలం గొరుమానుకొండ గ్రామానికి చెందిన సుశీల బాయ్ భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సుశీల పుట్టింటికి రవి నాయక్ ఫోన్ చేసి.. భార్యను తీసుకొస్తున్నట్లు చెప్పాడు. మరలా అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఇంట్లో తన భార్య కనిపించడం లేదని సుశీల తల్లిదండ్రులకు చెప్పాడు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని కొండల్లో సుశీల శవమై కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. రవినాయక్ సుశీలను చంపి పరారైనట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.
ఇవీ చదవండి..: తలనీలాలు.. ఇక్కడ తీస్తారు.. అక్కడ వేస్తారు!