కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు రైటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో హుస్సేన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు తన అన్న కొడుకులు దాడికి దిగారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు వాపోతున్నాడు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి...