కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిత్తరేణిపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. నరసింహులు అనే వ్యక్తి , మరో వ్యక్తితో కలిసి ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పని చేస్తుండగా ఉన్నట్లుండి ప్రధాన విద్యుత్ తీగ తెగి వారిపై పడింది. నరసింహులుతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆళ్లగడ్డలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నరసింహులు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన చికిత్స కోసం నంద్యాల తరలించారు.
ఇదీ చదవండి