ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కేసు నమోదు - కర్నూలు జిల్లా నేర వార్తలు

Kurnool District Crime News: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్​ స్టేషన్​ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. వీరారెడ్డి అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు.. వాళ్లకు నిప్పు అంటుకోకుండా పక్కకు తప్పించారు.

పోలీస్​ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jun 7, 2022, 3:44 PM IST

Man commits suicide at Yemmiganur town police: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వీరారెడ్డి అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే పోలీసులు.. వాళ్లను ప్రమాదం నుంచి తప్పించి పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి.. తన అత్త వెంకటేశ్వరమ్మ వద్ద రూ. 6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలుమార్లు అడిగినా రుణం చెల్లించకపోవడంతో వెంకటేశ్వరమ్మ.. జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక స్టేషన్​కు పిలిపించగా... అక్కడికి వచ్చిన వీరారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అప్పు చెల్లించకపోగా.. స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేర కింద వీరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరారెడ్డి.. భార్య హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.