కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం కేంద్రంలోని ఎస్బీఐ శాఖలో చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 29న బ్యాంకు ప్రధాన గేటు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై మేనేజర్ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ పట్టణ శివారు ప్రాంతంలో తలసాని రాము అనే వ్యక్తి అనుమానాస్పదంగా పట్టుబడ్డాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. బ్యాంకు చోరీని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 3 ద్విచక్రవాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆరు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్సై సూర్యమౌళి వెల్లడించారు.
ఇదీ చదవండి
గవర్నర్ కు లేఖ రాయడానికి రమేశ్ కుమార్ ఎవరు..? మంత్రి కొడాలి నాని