కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. దీంతో ఆలయాన్ని ఈనెల 21 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ ప్రకటించారు. భక్తులకు దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. కరోనా బాధిత ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మ డొనేట్ చేసి ప్రాణదాతలుకండి'