ప్రముఖ శైవ క్షేత్రం, కర్నూలు జిల్లా మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలయ్యాయి. ఈ నెల 14 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు అశ్వవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:
అలిపిరి కాలినడక మార్గంలో ఏడడుగుల పాము.. పరుగులు పెట్టిన భక్తులు