కర్నూలు జిల్లా నంద్యాలకు మహానందీశ్వర స్వామి చేరుకున్నాడు. మహానంది నుంచి ప్రత్యేక పల్లకిపై స్వామి వారిని తీసుకొచ్చారు. మహనందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామిని తీసుకెళ్లటం ఆనవాయితీ. ఈ సందర్భంగా నంద్యాలకు తీసుకొచ్చిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 9 నుంచి మహానందిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇదీ చదవండి: హనుమంత వాహనంపై కోదండరాముడిగా శ్రీ కల్యాణ వెంకన్న