ETV Bharat / state

పోలీస్ స్టేషన్​ ఎదుట ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - ఎమ్మిగనూరు తాజా సమాచారం

వారిద్దరూ ప్రేమించుకున్నారు... పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహాన్ని అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. చేసేదేమీ లేక పోలీసులను అశ్రయించారు. పెద్దలతో పోలీసులు మంతనాలు జరుపుతుండగానే.. ఏమైందో ఏమో గానీ.. పెళ్లి బట్టల్లోనే ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

Love couple commits suicide
Love couple commits suicide
author img

By

Published : May 21, 2021, 2:16 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ ఎదుట ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఆస్పరి మండలంలోని బనవనూరుకు చెందిన మైనర్లు మూడు రోజుల కిందట శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వివాహాన్ని ఒప్పుకోకపోవటంతో యువ జంట పోలీసులను అశ్రయించారు. ఇద్దరూ మైనర్లు కావటంతో పోలీసులు మంతనాలు జరుపతుండగానే.. తమను విడదీస్తారనే అనుమానంతో పెళ్లి దుస్తుల్లోనే శానిటైజర్​ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

చికిత్స కోసం పోలీసులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.