Lokesh Challenge to Minister Gummanuru: మంత్రి గుమ్మనూరు జయరాం కారుచౌకగా ఇట్టినా సంస్థ భూములు కాజేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేశారు. రైతులు ముందుకు వస్తే భూములు రాసిస్తా అన్న మంత్రి.. రిజిస్ట్రేషన్ తేదీ ఎప్పుడో ప్రకటించాలని సవాల్ విసిరారు. ఆ భూములను తామే కొని.. రైతులకు పంచుతామని లోకేశ్ స్పష్టం చేశారు.
మంత్రి గుమ్మనూరు జయరాం 180 ఎకరాల ఇట్టినా భూములు కాజేశారంటూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలు విడుదల చేశారు. కమర్షియల్ ల్యాండ్‌గా ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా చూపి మంత్రి జయరాం.. తన కుటుంబసభ్యుల పేర రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. 45 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 2 కోట్ల రూపాయల ప్రభుత్వ వాల్యూ చూపించి కారు చౌకగా కొట్టేసిన ఘనుడు బెంజ్ మంత్రి అంటూ విమర్శించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలను మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అతిక్రమించి.. భూములు కొన్నారని లోకేశ్ ఆరోపించారు. మంత్రికి భూములు అమ్మిన మంజునాథ్.. సేల్ డీడ్ ఎందుకు రద్దు చేకున్నారని ప్రశ్నించారు. ఆ భూములు అమ్మే హక్కు అతనికి లేదు కానుకే సేల్ డీడ్ రద్దు చేసుకున్నారని లోకేశ్ తెలిపారు.
"180 ఎకరాల ఇట్టినా భూములు మంత్రి జయరాం కాజేశారు. వాణిజ్య భూమిని వ్యవసాయ భూమిగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యవసాయ భూమిగా మార్చి తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రూ.45 కోట్ల భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువగా చూపించి కొట్టేశారు"- లోకేశ్,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
వ్యవసాయంలో కుటుంబ సభ్యులకు వచ్చిన ఆదాయంతో ఇట్టినా భూములు కొన్నామంటున్న బెంజ్ మంత్రి.. పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారని లోకేశ్ నిలదీశారు. కుటుంబ సభ్యుల భూములను.. ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. రైతులు ముందుకు వస్తే ప్రభుత్వ ధర ప్రకారం భూములు వెనక్కి ఇస్తామన్న బెంజ్ మంత్రి.. ఇప్పుడు ఎందుకు మాట మార్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఆ భూములు కొని రైతులకు పంచుతామని తాము అంటే దానికి స్పందించకుండా అర్దం లేని ఆరోపణలు చేస్తూ తిట్టడం ఎంత వరకూ సబబని మండిపడ్డారు. తాను నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేకే బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఆదాయపు పన్ను శాఖకు.. అడ్డంగా దొరికిపోయి నీతులు మాట్లాడటం బెంజ్ మంత్రికే చెల్లిందని దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి జయరాంను లోకేశ్ సవాల్ చేశారు. రైతులకి భూములు రాసిస్తా అని మంత్రి జయరాం అన్నారని...ఇందుకు తాము సిద్దమన్న లోకేశ్...రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్పాలన్నారు.
ఇవీ చదవండి: