కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో రూ.9.24 లక్షల విలువచేసే 155 కేసుల మద్యం సీసాలను పోలీస్ వాహనాలతో మంగళవారం ధ్వంసం చేశారు. గత కొన్ని నెలలుగా కర్నూలు జిల్లా కోడుమూరు సర్కిల్ పరిధిలోని గోనెగండ్ల, కోడుమూరు, సి.బెళగల్, గూడూరు మండలాల్లో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప ఆదేశాల మేరకు మంగళవారం గూడూరు మండల పరిధిలోని జూలకల్లు వద్ద కర్నూలు-ఎమ్మిగనూరు దారిలో మద్యం సీసాలను రోడ్డుపై పెట్టి పోలీసు వాహనాలతో ధ్వంసం చేశారు. మద్యం ధ్వంసం చేసిన వారిలో కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్సైలు మల్లికార్జున, శివాంజల్, శరత్ కుమార్, నాగార్జున ఉన్నారు.
ఇదీ చదవండి:
ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు... పోలీసుల అదుపులో 14 మంది యువకులు