అలిగిన పాలకమండలి సభ్యులు... ఆలస్యమైన లింగోద్భవ కార్యక్రమం - lingodhbhava abhishekam late in mahanandhi
మహాశివరాత్రి నాడు నిర్వహించే ప్రముఖ కార్యక్రమం లింగోద్భవం... కర్నూలు జిల్లా మహానందిలో ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో ప్రముఖులు పాల్గొంటారు. కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పాలకమండలి సభ్యులు అలిగి వెళ్ళి పోయారు. దీంతో కార్యక్రమం జరగాల్సిన సమయానికి జరగలేదు. అధికారులు, వేదపండితులు వెళ్ళి వారిని బుజ్జగించి తీసుకొచ్చారు. తర్వాత కార్యక్రమం పూర్తయింది.