Leopard wandering in kurnool district : కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లేకల్ గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో చిరుతపులి దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందాయని గొర్రెల యజమాని తాయప్ప తెలిపారు.
నిన్న రాత్రి సమయంలో చిన్నగా శబ్దం రావడంతో వెళ్లి చూడగా... గొర్రెలపై చిరుతపులి దాడి చేస్తూ కనిపించిందని.. చిరుతను తరిమేందుకు ప్రయత్నించగా తనపైన దాడి చేయటానికి యత్నించిందన్నారు. వెంటనే ఇంట్లోకి పరిగెత్తి తల దాచుకున్నానని తాయప్ప తెలిపారు. చిరుతపులి సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని... అయినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. చిరుత నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :