కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టును తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సందర్శించారు. ఇటీవల ప్రాజెక్టు లీకేజీ కావడంతో రైతులతో కలిసి జలాశయ గేట్లు, కట్టను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో గేట్ల మరమ్మతులకు కోటి తొమ్మిది లక్షలు మంజూరు చేస్తే వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని వెనక్కి పంపరన్నారు. ప్రాజెక్టు లీకేజీతో దిగువున ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి