కర్నూలు జిల్లా క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న కరోనా అనుమానిత, పాజిటివ్, నెగెటివ్ కేసులు, 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి వివరాలను... తప్పుల్లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఆన్‌లైన్ డేటా నమోదుపై ఉద్యోగులను ఆరాతీశారు. దిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఎందరున్నారు? పాజిటివ్, నెగెటివ్ ఉన్న వారి వివరాలేంటి? అన్నది క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. విధుల్లో ఉన్నప్పుడు తప్పకుండా గ్లౌజులు, మాస్కులు ధరించి దూరంగా ఉంటూ వివరాలు సేకరించాలని సూచించారు. దగ్గరికి వెళ్లి మాట్లాడాల్సి వస్తే పీపీఈలు ధరించాలన్నారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో నమోదు ప్రక్రియను పరిశీలించి సీఈవో వెంకటసుబ్బయ్యను వివరాలు తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: