ఊరి బాగుకోసం కొంతమంది యువకులు... స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిపరిష్కారానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు కాళ్లు అరిగేలా తిరిగినా చింత తీరలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీన్నే అవకాశంగా తీసుకొని నేతలను ప్రశ్నించాలని తీర్మానించుకున్నారు. తమకున్న సమస్యలనే ఇలా ఫ్లెక్సీ రూపంలో నిలబెట్టారు.
ఫ్లెక్సీలో రాసి పెట్టిన ప్రజాసమస్యలు తీరిస్తేనే ఊరిలో ప్రచారం చేసుకోమని నాయకులకు చెబుతున్నారీ పల్లెవాసులు. గ్రామానికి అవసరమైన పది రకాల సమస్యలు అందులో రాశారు. తాగునీరు, సాగునీరు, క్రీడాస్థలం, అదనపు ప్రభుత్వ పాఠశాల భవనం, తపాళా కార్యాలయం, పశు వైద్యశాల, డ్రైనేజీ కాలువలు, ఎల్ఈడీ బల్బులు, కమ్యూనిటీ హాలు, బస్టాండ్ వంటి సమస్యల చిట్టాను నేతల ముందు ఉంచారు. వీటిని తీర్చే నేతలే తమ గ్రామంలో అడుగుపెట్టాలని ఘంటాపథంగా చెబుతున్నారీ పల్లెజనం.