తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలు నగరంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా చేసేందుకే ఇలాంటి చర్యలకు దిగారని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి... శ్రీశైలం టికెట్ల కుంభకోణం.. 11 మందిపై వేటు