Increase in taxes on poor and middle class people: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మార్కెట్ విలువ ఆధారంగా.. భారీగా ఆస్తి పన్నులు పెంచేసింది. ఆస్తి పన్నులపై అప్పట్లో.. ప్రజా సంఘాలు ఆందోళనలు సైతం చేపట్టాయి. కొత్త విధానం ప్రకారం.. భారీగా పన్నులు పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో కొంతమంది పన్నులు చెల్లించగా.. మరికొంత మంది కట్టలేకపోయారు. ఇలాంటి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కుపిండి.. పన్నులు వసూలు చేయాలని కర్నూలు నగరపాలక సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా నగరంలోని సుమారు 5 వేల మందికి ఆస్తి పన్నులు చెల్లించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి నోటీసులు జారీ చేశారు. ఆందోళన చెందిన బాధితులు.. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్‌కు పరుగులు తీశారు.
కరోనా వల్ల వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. కొంతమంది దివాళా తీశారు. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలై... చాలా మంది ఉపాధి కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి కనికరం లేకుండా.. కనీసం సమయం ఇవ్వకుండా.. నోటీసులు జారీ చేసినట్లు ప్రజలు వాపోతున్నారు. పన్నుల భారం తగ్గించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: