కర్నూలు జిల్లా నుంచి ఉపాధి కోసం గుంటూరు వెళ్లిన కార్మికులను హోంమంత్రి సుచరిత చొరవతో వారి స్వగ్రామాలకు చేర్చారు. ప్రత్యేక బస్సుల్లో అధికారులు వారిని తరలించారు. జిల్లాలోని ఆలూరు, దేవనకొండ, హోళగుంద, చిప్పగిరి, హాలహర్వి, ఆస్పరి ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది పని కోసం గుంటూరు వలస వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న హోమంత్రి వారిని స్వగ్రామాలకు చేర్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 600 మందిని ప్రత్యేక బస్సుల్లో కర్నూలు జిల్లాకు చేర్చారు. వారందరినీ ప్రత్యేక శిబిరాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలలో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. తిరుపతిలో రాజస్థాన్ వలస కూలీలకు చేయూత