మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కర్నూలులో జనసేన నాయకులు ధర్నా చేపట్టారు. వీటిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే.. దిశ చట్టం ఉన్నా మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి స్పందించి.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పింఛన్ల కోసం.. డప్పు కళాకారుల నిరసన