ETV Bharat / state

'ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం ఉంటేనే కొవిడ్​ను తగ్గించవచ్చు'

రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి. మరణాల్లోనూ కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటానికి... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్న కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్యతో ఈటీవీభారత్ ముఖాముఖి.

kurnool-dmho-interview-on-corona
కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్యతో ఈటీవీభారత్ ముఖాముఖి
author img

By

Published : Jul 6, 2020, 6:03 PM IST

ప్రశ్న: కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు కారణం ఏమిటి?

జవాబు: జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా రావడానికి కారణం మొదట్లో దిల్లీ నుంచి వచ్చిన వారు. తరువాత కోయంబేడు మార్కెట్, ఇప్పుడు ఆదోని ప్రాంతానికి ముంబయి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు.. వీరి వల్లే కేసుల ఎక్కువగా వస్తున్నాయి.

ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందింది అంటున్నారు. ఎంత వరకు వాస్తవం?

జవాబు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల వల్ల బంధువులకు, చుట్టు పక్కల వారికి కూడా వ్యాధి సోకింది.

ప్రశ్న: ఇలా సోకకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

జవాబు: కరోనా కట్టడికి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాము. మాస్క్ లేకుండా బయట తిరగకుండా చర్యలు చేపట్టాం. మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రత, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం అవసరం.

ప్రశ్న: లక్షకు పైగా శాంపిల్స్ తీశారు. వీటికి ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి?

జవాబు: ప్రభుత్వ ఆదేశాల మేరకు వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు, వలస వచ్చిన వారు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారి నుంచి శాంపిల్స్ అధికంగా తీస్తున్నాం. వారిలో వివిధ రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి తదితర లక్షణాలు గుర్తించాం.

ప్రశ్న: ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంత వరకు అమలవుతోంది?

జవాబు: శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉండటంతో.. ఖచ్చితంగా ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నాం.

కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్యతో ఈటీవీభారత్ ముఖాముఖి

ప్రశ్న: మరణాల సంఖ్య కర్నూలు జిల్లాలో ఎందుకు అత్యధికంగా ఉంది?

జవాబు: జిల్లాలో కొంత వెనుకబాటు తనం, సరైన పోషకాహారం లేకపోవడం, వలస కూలీలు ఎక్కువగా ఉండటం, అవగాహన లోపం తదితర కారణాలతో పాటు వైరస్ విజృంభణ ఎక్కువగా ఉంటడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ప్రశ్న: మరణాలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: పెద్దాసుపత్రిలో ఒక కమిటీ వేశాం. క్షేత్ర స్థాయిలో అందరిని అప్రమత్తం చేసి పరీక్షలు ఎక్కువగా చేసి మరణాల రేటు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

ప్రశ్న: ఎక్కువగా వస్తున్న కరోనా రోగులకు పడకల కొరత ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?

జవాబు: ఇప్పుడు వస్తున్న కేసుల సంఖ్యకు సరిపడ పడకలు, సిబ్బంది కావాల్సినంత ఉన్నారు. మనం ముందు నుంచి కూడా జాగ్రత్తగా ఉన్నాం. ఎటువంటి భయం అవసరం లేదు.

ప్రశ్న: వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు ఎంత వరకు అందుబాటులో ఉన్నాయి?

జవాబు: వైద్య సిబ్బందికి, రోగులకు సరిపడా పీపీఈ కిట్లు, మాస్కులు, మందులు, కావాల్సిన దాని కంటే అధికంగానే ఉన్నాయి.

ప్రశ్న: రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. కేసులు ఎప్పటి నుంచి తగ్గుముఖంపట్టే అవకాశం ఉంది?

జవాబు: మనం చాలా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి తోడు ప్రజల సహకారం సైతం చాలా అవసరం. అప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.

ప్రశ్న: కరోనా వ్యాధి గురించి ప్రజలకు ఎమైనా చెప్పదల్చుకున్నారా?

జవాబు: కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే మరణాలను కూడా తగ్గించవచ్చు.

ఇవీ చదవండి: ఆధార్ అప్​డేట్ కోసం పోస్టాఫీసుకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.