ఈటీవీ భారత్ కథనానికి కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ స్పందించారు. ఆసుపత్రి ఆవరణలో వృద్ధుడు అనుమానాస్పద మృతిపై కర్నూలు ఆర్డీవో డీకే వెంకటేశ్వర్లును విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు. ఈ ఘటనపై త్వరతగతిన విచారణ జరిపి.. నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
అసలు ఏం జరిగిందంటే..
కర్నూలు సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన చెంచురెడ్డి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగా.. విశ్వభారతి కొవిడ్ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. విశ్వభారతి ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ నుంచి కర్నూలుకు వెళ్లాలని వైద్యులు బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించుకోలేదు. కర్నూలు ఆసుపత్రికి చెంచురెడ్డిని తీసుకువెళ్లగా.. ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు వదిలాడు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కొవిడ్ అనుమానితుడు మృతి