కర్నూల్ లో తెదేపా వినూత్న ప్రచారం కర్నూలు శాసనసభ నియోజకవర్గతెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విస్తృతంగా ప్రచారం చేశారు. తెదేపా చేసిన అభివద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ... ధర్మపేటలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిందని చెప్పారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.