ETV Bharat / state

ఆటోమేటిక్ శానిటైజర్.. తాకకుండానే చేతులు శుభ్రం - శానిటైజర్పై పై వార్తలు

కరోనా నేపథ్యంలో శానిటైజర్ నిత్యావసర సరకుల్లో ఒకటిగా మారిపోయింది. దుకాణాల్లో, కంపెనీల్లో శానిటైజ్ చేసుకుని కానీ లోపలికి వెళ్లం. ఆ శానిటైజర్ బాటిల్ని ప్రతి ఒక్కరూ తాకుతారు. దాని ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ ఆటోమేటికి శానిటైజర్ పరికరాన్ని రూపొందించారు.

karnool lactures discover sanitizer
karnool lactures discover sanitizer
author img

By

Published : Jul 9, 2020, 8:37 PM IST

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ వన్నూరు ఆటోమేటిక్ శానిటైజర్ యంత్రాని రూపొందించారు. శానిటైజర్ డబ్బాను తాకకుండానే.. దాని కింద చేయి పెడితేనే.. ద్రావణం మన చేతిలో పడుతుంది. కరోనా నియంత్రణకు తన వంతు కృషి చేయాలని ఈ పరికరాన్ని తయారు చేసినట్లు వన్నూరు తెలిపారు.

ఆటోమేటిక్ శానిటైజర్ యంత్రం తయారీకి ఏడు వందలు ఖర్చు అవుతుందని వన్నూరు తెలిపారు. ఎక్కువ మోతాదులో తయారు చేస్తే నాలుగు వందలలోపు సరిపోతాయన్నారు. కళాశాల ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు తయారీ విధానం నేర్పిస్తానని లెక్చరర్ అంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.