రాష్ట్రంలో వైకాపా మంత్రులు, నేతలే పేకాట క్లబ్బులు, గుండాట శిబిరాలు నిర్వహిస్తూన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలోనే మంత్రి అనుచరులు, వైకాపా నేతలు పేకాట ఆడుతూ పట్టుబడుటమే కాక.. పట్టుకున్న పోలీసులపై దాడి చేయటం హేయమని దుయ్యబట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జయరాం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపించి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవకర్గం పులివెందులలోనూ వైకాపానేతలు యథేచ్ఛగా పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు, గుండాట నిర్వహిస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలపై దృష్టి పెట్టి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఇదీ చదవండి: మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి