ETV Bharat / state

ప్రేమ కోసమే..పిడకల సమరం..!

author img

By

Published : Apr 15, 2021, 12:02 PM IST

ప్రేమఫలించాలని పూజలు చేస్తాం. పెళ్లి కోసం ఇంట్లో ఒప్పుకునేలా వెయిట్ చేేస్తాం. ప్రేమ గెలవడానికి రెండు వర్గాలు యుద్దాలు చేస్తుంటాయి. అలాంటివి ఎన్నో చూశాం కదా. కానీ ఓ ప్రాంతంలో ప్రేమ సఫలం కోసం పిడకలతో కొట్టుకుంటారు. అమ్మాయి తరపు వారు, అబ్బాయి తరుపు వారు పిడకలతో కొట్టుకుంటారు. ఇలా కొట్టుకోవడాన్ని అక్కడ ఉత్సవం అంటారు. ఆ అమ్మాయి ఎవరో..ఆ అబ్బాయి ఎవరో..ఆ సమరం ఎక్కడో తెలుసుకోండి.

kairuppa  cow dung  fight celebrations at kairuppa
పిడకల సమరం
పిడకల సమరం

మాములుగా జాతరలలో ఊరేగింపులు , కోలాటాలు, కర్రసాము, బండలాగుడు పోటీలు చూస్తూంటాం. కానీ ఓ ప్రాంతంలో ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఆ ఊరిలో కొంతమంది రెండు వర్గాలుగా విడిపోయి.. పిడకలతో కొట్టుకుంటారు. ఈ జాతరను పిడకల సమరం అంటారు. ఇదంతా ప్రేమకోసమే చేస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా పిడకల సమరం బుధవారం సంబరంగా జరిగింది. వీరభద్ర స్వామి ఉత్సవాలలో భాగంగా ఉగాది మరుసటి రోజు పిడకల సమరం ఘనంగా నిర్వహిస్తారు. వీరభద్ర స్వామి సాయంత్రం సమయంలో హంద్రీనది తీరానికి వెళ్లి వచ్చేటప్పుడు.. భద్రకాళి వారి మనషులు పిడకలు వేసి అవమానిస్తారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఈ సంఘటన జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు పిడకల సమరం కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది అందులో భాగంగానే మంగళవారం ఘనంగా పిడకల సమరం నిర్వహించారు. కారుమంచి రెడ్డి గుర్రంపై వచ్చి.. ఏళ్లుగా వస్తున్న గ్రామ ఆనవాయితీని ప్రారంభించారు.

భద్రకాళి వైపు కొన్ని వర్గాలవారు ... వీరభద్ర స్వామి వైపు మిగిలిన వారు ఉండి ఒకరిపై ఒకరు పిడకలను వేసుకుంటారు. ఈ విధంగా సుమారు గంట సేపు జరిగిన సమరంలో ఇరవై రెండు మంది దాకా స్వల్ప గాయాలయ్యాయి. చివరికి భద్రకాళి వర్గం వారు వెనకడుగు వేయడంతో వీరభద్ర స్వామి వర్గంవారు పైచేయి సాధించి విజయం పొందారు. తర్వాత అందరూ కలిసి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు.ఈ సమరంలో దెబ్బలకు స్వామివారి విభూతిని మందుగా రాసుకుంటారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.