ETV Bharat / state

Buggana Rajendranath: కర్నూలులోనే న్యాయ రాజధాని: బుగ్గన - కర్నూలులోనే న్యాయ రాజధాని అన్న మంత్రి బుగ్గన

Buggana Rajendranath: రాయలసీమపై ఉన్న మమకారంతోనే ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారని.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ కళాశాలనూ కర్నూలులోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Judicial capital will be in Kurnool says minister Buggana rajendranath
కర్నూలులోనే న్యాయ రాజధాని: బుగ్గన
author img

By

Published : Apr 2, 2022, 8:48 AM IST

Buggana Rajendranath: ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చిన తర్వాత.. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు భవనాలను కర్నూలు నగర శివారులోని జగన్నాథ్‌గుట్టపై నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె వద్ద.. రూ.57.35 కోట్లతో చేపట్టనున్న సంజీవయ్యసాగర్‌ జలాశయం అభివృద్ధి పనులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శుక్రవారం భూమిపూజ చేశారు. శిలాఫలకం ఆవిష్కరించారు. రాయలసీమపై ఉన్న మమకారంతోనే ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారని బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ కళాశాలనూ కర్నూలులోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కర్నూలులో రూ.100 కోట్లతో సిల్వర్‌ జూబ్లీ కళాశాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ఇళ్లు నిర్మించే స్తోమత లేదని'... చేతులెత్తేస్తున్న లబ్ధిదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.