ETV Bharat / state

కరోనా కాటుతో.. మాయమైన గుబాళింపు - చాగలమర్రిలో తగ్గిన మల్లెపూల విక్రయాలు వార్తలు

ఎండకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలకి గిరాకీ అధికంగా ఉండేది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో... మల్లెపూల విక్రయాలు అమాంతంగా పడిపోయాయి. ఎవరూ కొనని కారణంగా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

  jasmine flowers  sales reduced at Kurnool
మండీలో వ్యాపారం లేక మిగిలిన మల్లెలు
author img

By

Published : May 11, 2021, 7:10 PM IST

ఏ శుభకార్యం జరిగినా అవసరమయ్యేవి పూలు. కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 3 వేల ఎకరాల్లో మల్లెపూల తోటలు చాగలమర్రిలో ఉన్నాయి. చాగలమర్రి సరిహద్దు కడప జిల్లా కానగూడూరు చుట్టుపక్కల గ్రామాల్లోనూ వేల ఎకరాల్లో మల్లె సాగు అవుతోంది. ఒక్క చాగలమర్రిలోనే అయిదు పూల మండీల ద్వారా రోజుకు పది టన్నుల పూలు బెంగళూరు, హైదరాబాదు, ముంబయి తదితర నగరాలకు ఎగుమతి అవుతాయి. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ కారణంగా పూల ధర అమాంతం పడిపోయింది. ఎగుమతి లేక, కరోనా ప్రభావంతో శుభకార్యాలు నిలిచిపోయి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. మల్లెపూల గుబాళింపు పూల వాసనలోనే తప్పితే రైతుల మోములో కనిపించడం లేదు.

రెండు వేల మంది కూలీలపై ప్రభావం

ప్రతి రోజూ ఆళ్లగడ్డ, రుద్రవరం, ఆలమూరు, చాగలమర్రి, కడప జిల్లా దువ్వూరు మండలాల నుంచి దాదాపు రెండు వేల మంది కూలీలు చాగలమర్రి పరిధిలో మల్లెపూలు కోసేందుకు వస్తుంటారు. తోటలన్నీ కూలీలు, మల్లెపూలతో నిండిపోయేవి. కరోనా ప్రభావంతో రవాణాలేక ఎక్కడికక్కడ పూల సేకరణ నిలిచిపోయాయి. కర్ఫ్యూతో పూల ఎగుమతి తగ్గిపోయింది. పొలాల్లో పూలు కోసే కూలీల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రస్తుతం ఉన్న తక్కువ ధరలకు పూలు సేకరించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అరకొరగా పూలను కోయిస్తున్నారు, లేదా అలాగే వదిలేస్తున్నారు.

కిలో రూ.300 నుంచి రూ.30..

వేసవి సీజన్‌లో కిలో పూల ధర రూ.300 నుంచి రూ.400 వరకు పలుకుతుంటాయి. ఈ ఏడాది మే నుంచే శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మంచి లాభాలు గడించవచ్చనుకున్న అన్నదాతలకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కరోనా విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా రవాణా, శుభకార్యాలకు ఆంక్షలు విధించారు. దీంతో కిలో మల్లెపూల రూ.300 పలకాల్సింది కేవలం రూ.50 నుంచి రూ.30 ధర పలుకుతోంది. దీంతో ఇక్కడి రైతన్నలకు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

ప్రభుత్వం ఆదుకోవాలి

ఏటా వేసవి కాలంలో కిలో మల్లెపూలు రూ.300 పైగా ధర పలికేవి. ప్రస్తుతం రూ.50 లేదా రూ.30కి మాత్రమే ధర పలుకుతోంది. తీవ్రంగా నష్టపోయాం. ధర పడిపోవడంతో పూలు కోయడం తగ్గించేశాం. 50 కేజీలకు పైగా రోజూ పూలు వచ్చేవి. ప్రస్తుతం 10 కేజీలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. ధర లేకపోవడంతో ఏటా ఎకరానికి పెట్టే రూ.లక్ష నష్టపోయాం. ప్రస్తుతం పూలు వాటికి అయ్యే ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. - నాగిరెడ్డి, రైతు, గొడిగనూరు

కూలీ సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది

ధర బాగున్నప్పుడు కూలీలు పెద్ద సమస్యగా ఉండేది కాదు. ప్రస్తుతం పూల ధర పడిపోవడంతో తక్కువ మంది కూలీలతోనే పూలు కోయిస్తున్నాం. 20మంది కూలీలు వచ్చే 4 ఎకరాల పొలానికి ప్రస్తుతం పది మందితోనే పనులు చేయిస్తున్నాం. ఆ కూలీలకు కూడా సరిపడా డబ్బురావడం లేదు. - ఫయాజ్‌, రైతు, చాగలమర్రి

ఇదీ చూడండి:

ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.