కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రేపు పర్యటించనున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మూడో విడత వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఆరోగ్య వికాస కేంద్రాల నమూనా భవనాలు పరిశీలించి శిలఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైకాపా ఎమ్మెల్యేలు శిల్పాచక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. సభుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి