Jagan promised to set up tomato juice and onion powder Industry: పత్తికొండ టమాటా ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లిపాయల పొడి తయారీ యూనిట్ల ఏర్పాటు గురించి సీఎం గతంలో అనేక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను జారీ చేసి.. రెండున్నర నెలలు దాటినా వాటి అమలు దిశగా ఒక్క అడుగూ పడలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 5 వేల 6 వందల హెక్టార్లలో టమాటా సాగవుతోంది. పంట చేతికొచ్చేసరికి ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రైతులు టమాటా జ్యూస్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టమాటా జ్యూస్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఆయన ఇచ్చిన హామీలకు మోక్షం కలగలేదు.
Farmers agitation: సాగు నీటి కోసం అన్నదాత పోరాటం.. ఏళ్లుగా విస్తరణకు నోచుకోని గుంటూరు ఛానల్
Jagan Assurance in Pattikonda Sabha: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మట్లాడుతూ రెండు నెలల్లో టమాటా జ్యూస్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. రెండున్నర నెలలు గడిచినా నేటికీ దాని ఊసేలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు కావడంతో జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు హుటాహుటిన కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. వాటిలో రెండు ప్రాంతాలు టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. వారాలు గడుస్తున్నా నేటికీ శంకుస్థాపనకు సంబంధించిన అంశంపై ఎలాంటి సమాచారం జిల్లా అధికారులకు అందలేదు. తాజాగా టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు కోసం పత్తికొండ సమీపంలో మూడున్నర ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి ఆ భూమిని అప్పగిస్తారని తెలిసింది.
Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలురైతులు
TDP Government Allotted Land to Jain Irrigation Company: జైన్ ఇరిగేషన్ సంస్థకు టీడీపీ ప్రభుత్వం తంగడంచలో 6 వందల 23 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ సంస్థ తమకు కేటాయించిన భూముల్లో టమాటా జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని.. తమ సంస్థకు నీటి సదుపాయం కల్పిస్తే చాలని వైసీపీకి చెందిన ఓ కీలక నేత దగ్గర ప్రతిపాదించింది. నీటి సదుపాయం కల్పించడానికి అవసరమైన పైపులను కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వానికి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ పరిశ్రమను పత్తికొండ నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేయాలని ఆ నేత కోరడంతో జైన్ సంస్థ వెనకడుగు వేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడి నుంచి అయినా టమాటా కొనుగోలు చేస్తామని.. తమకు భూములున్న చోట కాకుండా మరోచోట పరిశ్రమ ఏర్పాటు చేయడానికి భారీగా వ్యయం అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతిపాదన ఆ నేత దగ్గరే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టమాటా జ్యూస్ పరిశ్రమ కల ఎప్పటికి సాకారం అవుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు
Onion Powder Manufacturing Industry has not Started: మ్యాగి సంస్థతో మాట్లాడామని.. గ్రామస్థాయిలో ఉల్లి పొడి తయారుచేసే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించి.. ఈ పొడిని ఆ సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్న జగన్ హామీ నేటికీ నెరవేరలేదు. ముఖ్యమంత్రి పత్తికొండ పర్యటన తరువాత మచ్చుకు ఒక్క ఉల్లిపొడి తయారీ పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సగటున సుమారు 20 వేల హెక్టార్లలో ఉల్లి పంటను పండిస్తున్నారు. వేలాది మంది ఉల్లి రైతులు ఆర్థికంగా మరింత లబ్ధి పొందేలా ఉల్లి పొడి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని వేలాది మంది ముందు ఘనంగా ప్రకటించిన సీఎం.. ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయించక పోవడంతో రైతులు విస్మయానికి గురవుతున్నారు.