విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్‌లో ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. నంద్యాలలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ఎమ్మిగనూరులో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు తిరగలేదు. వామపక్షాలు 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు.
ఆదోనిలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు వామపక్షాలు, తెదేపా, ప్రజా కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
కోడుమూరు పట్టణంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించటం నిరసిస్తూ.. సీపీఐ, సీపీఎం, తెదేపా, వైకాపా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి: