కర్నూలు జిల్లా ఆదోని వంశీ చైతన్య ఆస్పత్రిలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఆదోని మండలం అలసందగుత్తి గ్రామానికి చెందిన రేణుకమ్మ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. బుధవారం సాయంత్రం పండంటి పాపకు జన్మనివ్వగా.. బురుఖాలో వచ్చి గుర్తు తెలియని మహిళా కిడ్నాప్ చేసింది.
కిందకి రమ్మని చెప్పి..
ఉదయం పోలియో టీకా వేయిస్తానని పాపను వెంట తీసుకుని కిందకు రావాలని మహిళ చెప్పిందని తండ్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో గేట్ దగ్గరకు వెళ్లగానే బురుఖాలో ఉన్న మహిళ పాపను ఎత్తుకెళ్లి పరారైందని బాధితుడి తండ్రి శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలి తరఫున ఫిర్యాదు రావడంతో డీఎస్పీ వినోద్ కుమార్ ఆస్పత్రిలోని నిఘా కెమెరాలను పరిశీలించారు.
ఇవీ చూడండి : 'వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి'