ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. నలుగురు అరెస్టు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణా జోరందుకుంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో సరకును తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా మాధవరం, తిరుపతిలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మద్యం, నలుగురిని అరెస్టు చేశారు.

illegal wine seized in madhavaram, thirupathi in andhrapradhesh
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత... నలుగురు అరెస్టు
author img

By

Published : Mar 6, 2021, 9:26 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్టు వద్ద కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దేవనకొండ మండలంలోని ఐరన్​బండ గ్రామానికి చెందిన రామన్న, రవి అనే ఇద్దరు వ్యక్తులు లక్షన్నర రూపాయలు విలువైన కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు... కారును అనుసరించి పట్టుకున్నారు. కారు, మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

మరో ఘటనలో కారులో ప్రత్యేక అరను ఏర్పాటు చేసుకుని అక్రమ మద్యం తరలిస్తున్న నిందితులను తిరుపతి ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నగరంలోని ఎస్వీ జూ పార్క్ సమీపంలో... అలిపిరి చెర్లోపల్లి రహదారిపై అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో.. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 128 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇదీచదవండి.

మెున్ననే వార్నింగ్ ఇచ్చా.. ఇక యాక్షన్​లోకి దిగుతా: తమ్మినేని వాణి శ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.