ETV Bharat / state

mpp-elections: 'ఎంపీపీ పదవి ఇవ్వకపోతే.. ఆ​ విగ్రహాన్ని వెయ్యిముక్కలు చేస్తాం' - కర్నూలు జిల్లా

ఎంపీపీ(mpp) పదవి ఇవ్వకపోతే వైఎస్​ఆర్​ విగ్రహాన్ని వెయ్యి ముక్కలు చేస్తామని ఎంపీటీసీ, ఆమె కుమారుడు గడ్డపారను చేత పట్టుకుని నిరాహార దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఎంపీటీసీ కుమారుడిని, మరో నలుగురి అరెస్టు చేశారు.

mpp-elections: 'ఎంపీపీ పదవి ఇవ్వకపోతే..వైఎస్​ విగ్రహాన్ని వెయ్యిముక్కలు చేస్తాం'

author img

By

Published : Sep 24, 2021, 4:47 PM IST

ఎంపీపీ(mpp) పదవి ఇవ్వకపోతే వైఎస్​ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వెయ్యి ముక్కలు చేస్తామని కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు హెచ్చరించారు. ఎంపీపీ పదవికోసం నిన్నటి నుంచి దీక్ష చేస్తున్న తల్లీ కుమారుడు శిబిరం వద్ద గడ్డపార పట్టుకుని ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి దీక్షా స్థలానికి చేరుకున్నారు. దీక్షను విరమింపజేశారు. ఎంపీటీసీ రాజమ్మ కుమారునితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. ఎంపీపీ ఎన్నిక శుక్రవారం గూడూరు మండల కేంద్రంలో ఉండడంతో ఎంపీటీసీ రాజమ్మను శిబిరం వద్దనే వదిలేశారు.

ఇటీవలి పరిషత్​ ఎన్నికల్లో కె నాగలాపురం గ్రామం ఎంపీటీసీగా రాజమ్మ.. అధికార వైకాపా నుంచి గెలిచారు. అయితే ఎంపీపీని తననే చేయాలని ఆమె పట్టుబట్టారు. రాజమ్మ ఆమె కుమారుడు నరసింహారెడ్డి నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఇదీ చదవండి: mpp-elections: వైకాపాలో వర్గవిభేదాలను బయటపెడుతున్న ఎంపీపీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.