కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నిరసనకు దిగారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం, సాగు భూమి పంపిణీ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి ఇంటి స్థలాల పంపిణీ చేస్తామని చెబుతున్నా... అందుకు అవసరమైన స్థల సేకరణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ప్రతి నిరుపేదోడి సొంతింటి కల సాకారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశామని తెలిపారు.
ఇదీ చూడండి: 'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి'