ETV Bharat / state

HIGH COURT : 'ఆ భూమిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు' - high court on govt lands

ఓ సారి భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పరిహారం అందుకున్నాక అది ప్రభుత్వ భూమిగా మారుతుందని.. దానిని నిబంధనలకు లోబడి ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అందుకోసం వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కారణంగా తిరిగి తనకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : May 25, 2022, 4:49 AM IST

నిర్దిష్ట అవసరం కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని అందుకోసం వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కారణంగా తిరిగి తనకు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం.. దానిని ప్రభుత్వం ఇతర అవసరాలకు, భూమి లేని నిరుపేదలకు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రభుత్వం ఆ భూమికి యజమానిగా.. నిబంధనలకు లోబడి ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓ సారి భూసేకరణ ప్రక్రియ పూర్తయి, పరిహారం అందుకున్నాక, ప్రభుత్వం స్వాధీనంలోకి ఆ భూమి వెళ్లాక, భూ యజమాని దానిని వెనక్కి ఇవ్వాలని కోరలేరని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

బలహీనవర్గాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం దేవనూరులో తనకు చెందిన 2.57 ఎకరాలను భూసేకరణ కింద తీసుకున్నారని, ఆ భూమిని ఖాళీగా ఉంచినందున తనకు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ పి.సుంకిరెడ్డి 2015లో హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు భూసేకరణ సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను పరిగణనలోకి తీసుకొని దీనినికొట్టేయాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వినియోగించడం లేదనే కారణంతో పిటిషనర్‌కు తిరిగి అప్పగించాలని ఆదేశించలేమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అట్టుడికిన అమలాపురం.. 'కోనసీమ' జిల్లా పేరు మార్పుపై హై టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.