కర్నూలు జిల్లా అవుకు జలాశయం గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. గేట్లకు సెకండరీ కాంక్రీట్ ఊడిపోవటంతో నీరు వృథాగా పోతోంది. ప్రస్తుతం జలాశయంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది సైతం ఇలాంటి సమస్యే ఎదురవ్వటంతో.. విశాఖ నుంచి నిపుణులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ లీకేజీలు ఇలాగే పెరిగితే.. పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా లీకేజీలు అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: