కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. బుధవారం జిల్లాలో 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1483కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా బుధవారం నలుగురు మరణించగా.. ఇప్పటి వరకు 42 మంది కరోనా కాటుకు బలయ్యారు. 807 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా... 634 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మండలాల వారీగా కేసుల సంఖ్య..
జిల్లాలో పది పురపాలక సంఘాలు, 54 మండలాల పరిధిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని కలెక్టర్ వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదైన కేసుల్లో కేవలం కర్నూలు నగరంలోనే 689 ఉండటం గమనార్హం. కర్నూలు గ్రామీణ ప్రాంతంలో 8, ఆదోనిలో 320, ఆదోని గ్రామీణ ప్రాంతంలో 26, నంద్యాలలో 168, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 15, ఆత్మకూరులో 22, ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో 1, ఎమ్మిగనూరు 21, ఎమ్మిగనూరు గ్రామీణ ప్రాంతంలో 6, కౌతాళం 21, కోడుమూరు 14, బనగానపల్లె 13, పత్తికొండ 13, నందికొట్కూరు పట్టణం 12, నందికొట్కూరు గ్రామీణ ప్రాంతంలో 1, పాణ్యం 10, ఆలూరు 9, దేవనకొండ 9, తుగ్గలి 9, కోసిగి 7, గూడూరు 7, డోన్ 5, చాగలమర్రి 5, మద్దికెర 5, ఆళ్లగడ్డ పట్టణం 2, ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతంలో 4, చిప్పగిరి, కోవెలకుంట్ల, మంత్రాలయం, నందవరం, అవుకు, పాములపాడు, పెద్దకడుబూరుల్లో 4 చొప్పున, శిరివెళ్ల , ఉయ్యాలవాడ మండలాల్లో 3 చొప్పున, బండి ఆత్మకూరు, గడివేముల, గోనెగండ్ల, కల్లూరు, మహానంది, ఓర్వకల్లు మండలాల్లో రెండేసి, ఆస్పరి, సీ బెళగల్, గోస్పాడు, జూపాడు బంగ్లా, హొళగుంద, కొత్తపల్లి, కృష్ణగిరి, మిడుతూరు, పగిడ్యాల, ప్యాపిలి, రుద్రవరం, సంజామలలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 68,871 మంది నమూనాలు సేకరించారు. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వలస కూలీల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవరసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
ఇదీచదవండి.