కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించాలని హమాలీలు, కార్మికులు మార్కెట్ ముందు ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ నివారణ చర్యలు పాటిస్తూ వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించాలని సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ. గఫూర్ అన్నారు. రైతులకు ఉపయోగపడే మార్కెట్‌ను బంద్ చేసి మద్యం షాపులు తెరిస్తే ఏం లాభమంటూ ప్రశ్నించారు. అధికారులు స్పందించి మార్కెట్‌ను తెరవాలని… లేని పక్షంలో హమాలీలకు నెలకు ఆర్థిక సహాయం అందించాలని గఫూర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :