కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వడగళ్ల వాన కురిసింది. పలుచోట్ల భారీ చెట్లు పడిపోయాయి. ఈదురుగాలులతో వడగళ్ల వాన మొదలైంది. ఈదురుగాలుల దెబ్బకు పెద్దఎత్తున చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు అరగంట పాటు వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది.
ఇదీచూడండి. రోడ్లపైకి రానున్న ఆర్టీసీ బస్సులు...సీట్ల సర్దుబాటు