కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్ లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. రోజులు గడుస్తున్నా తహసీల్దార్ ఎక్కడ ఉంది..? అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. తాజాగా ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు.... కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ ఉన్నతాధికారులు ఫోన్ చేసినా... ఆమె అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఆ ఉచిత సలహాలతో...
హసీనాబీకి సన్నిహితంగా ఉండే ఇద్దరు తహసీల్దార్లు... ‘నేరుగా లంచం తీసుకుంటూ దొరకలేదు కదా..? ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోమంటూ సలహాలిచ్చినట్లు తెలుస్తోంది. వారినీ 2 రోజుల పాటు అనిశా అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే హసీనాబీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా... బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ఆమెకు వేరే మార్గం లేదని... ఏసీబీ డీఎస్పీ వద్ద గానీ... ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి