కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ కుటుంబం.. తమ పెంపుడు కుక్క చనిపోతే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్ రెడ్డి, లత దంపతులు 17 ఏళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. వారికి పిల్లలు లేని కారణంగా.. ఆ శునకమే సర్వస్వంగా ఇన్నాళ్లు బతికారు. టామీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న శునకం కన్నుమూసింది. తమ టామీ ఇక లేదని తెలిసి ఆ దంపతులు గుండెలవిసేలా రోదించారు. తీవ్ర వేదనతో.. అంత్యక్రియలు జరిపించారు. డప్పు చప్పుళ్లతో టామీ మృతదేహానికి ఊరేగింపు చేశారు. శ్మశాన వాటికలో వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రక్రియ పూర్తి చేశారు.
ఇవీ చదవండి...పాట పాడుతూనే..గాల్లో కలిసిన ప్రాణం