ETV Bharat / state

ఉచితంగా పశుగ్రాసం మొక్కలు - veldurti

కర్నూలు జిల్లా రామళ్ళకోటలో డీఆర్​డీఏ, వెలుగు ఆధ్వర్యంలో సహకార సంఘం సభ్యులు పశుగ్రాస మొక్కలు నాటారు.

పశుగ్రాసం మొక్కలు
author img

By

Published : Jul 19, 2019, 7:47 AM IST

పశుగ్రాసం మొక్కలు నాటిన అధికారులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటలో దస్తగిరి అనే రైతు పొలంగట్ల మీద డీఆర్​డీఏ, వెలుగు అధికారులు మొక్కలు నాటారు. అవిశ, సుబాబుల్, మునగ మొక్కలను ఉచితంగానే రవాణా ఖర్చుతో కలిపి పోలంలో నాటించే బాధ్యతను డీఆర్​డీఏ, వెలుగు తీసుకుందని అధికారులు తెలిపారు. మూడు నెలలకు ఓసారి పంట చేతికొస్తుందని.. ప్రతి నెల ఆకులను కత్తిరించి గొర్రెలు, పశువులకు వేస్తే 25 శాతం ప్రొటీన్లు అదనంగా అందుతాయని చెప్పారు. రైతులు ఇటువంటి మొక్కలను పెంచుకుంటే పశుగ్రాస కొరత ఇబ్బంది ఉండదని సూచించారు.

పశుగ్రాసం మొక్కలు నాటిన అధికారులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటలో దస్తగిరి అనే రైతు పొలంగట్ల మీద డీఆర్​డీఏ, వెలుగు అధికారులు మొక్కలు నాటారు. అవిశ, సుబాబుల్, మునగ మొక్కలను ఉచితంగానే రవాణా ఖర్చుతో కలిపి పోలంలో నాటించే బాధ్యతను డీఆర్​డీఏ, వెలుగు తీసుకుందని అధికారులు తెలిపారు. మూడు నెలలకు ఓసారి పంట చేతికొస్తుందని.. ప్రతి నెల ఆకులను కత్తిరించి గొర్రెలు, పశువులకు వేస్తే 25 శాతం ప్రొటీన్లు అదనంగా అందుతాయని చెప్పారు. రైతులు ఇటువంటి మొక్కలను పెంచుకుంటే పశుగ్రాస కొరత ఇబ్బంది ఉండదని సూచించారు.

ఇది కూడా చదవండి

నీటి సంక్షోభం... కర్నూలు నగరం మరో చెన్నై కానుందా?

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_Atp_46_01_Yakapa_Hangama_At_Solar_Project!_AVB_C8


Body:వైకాపా నాయకుల హడావిడి అన్ని రంగాలకు విస్తరిస్తోంది . తాజాగా అనంతపురం జిల్లా నంబుల పూల కుంట మండలంలో ని సౌర విద్యుత్ ప్రాజెక్టులో హల్ చల్ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న వైకాపా నాయకులు సౌర విద్యుత్ ప్రాజెక్టులోకి చేరుకొని పనులను అడ్డుకున్నారు. తమ పార్టీ శాసనసభ్యుడిని సంప్రదించాకే పనులు ప్రారంభించాలని అంటూ హుకుం జారీ చేశారు . ఎన్టీపీసీ సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో లో ప్రైవేట్ కంపెనీల కు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భూమిని లీజుకు ఇచ్చింది . ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లీజుకు తీసుకున్న భూముల్లో ప్రైవేట్ కంపెనీలో సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం పనులను ప్రారంభించాయి . ఇప్పటికే 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది . మరో 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి . విద్యుత్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సాగుదారులు పట్టాదారుల నుంచి భూమిని సేకరించింది ఇది సంబంధించి అర్హులైన రైతులందరికీ పరిహారం చెల్లించింది చిన్నపాటి సమస్యలున్న కొందరు రైతుల కు పరిహారం జమ కాలేదు. దీనిని సాకుగా చూపుతూ రైతులందరికీ పరిహారం ఇచ్చాకే పనులు చేయాలంటూ వందల సంఖ్యలో వైకాపా కార్యకర్తలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రవేశించారు. అక్కడి అధికారులు సిబ్బందిపై దురుసుగా వ్యవహరిస్తూ దాడికి యత్నించారు. పోలీసులు వారిస్తున్న ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు హంగామా సృష్టించారు. విద్యుత్ ప్రాజెక్టు అధికారులు ద్వారా సమాచారం అందుకున్న కదిరి డిఎస్పి శ్రీనివాసులు తమ సిబ్బందితో సౌర విద్యుత్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. నిజమైన విషయాన్ని వివాదంగా మారిన వద్దంటూ వైకాపా నాయకులకు సూచించారు. పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వైకాపా శ్రేణులకు డీఎస్పీ సూచించారు. పనులు ఆపేసే వరకు ఎవరి మాట వినేది లేదంటూ వైకాపా నాయకులు ప్రొక్లెయిన్లను, ట్రాక్టర్ లను, సిబ్బందిని బయటకు పంపివేశారు. తరువాత వైకాపా నాయకులు వెళ్లిపోయారు


Conclusion:బైట్
శ్రీనివాసులు ,కదిరి డి.ఎస్.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.