కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్నహెల్త్ అలవెన్సులు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ నాయకురాలు నిర్మల డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఏడో డివిజన్ ముందు ధర్నా నిర్వహించారు.
అందులో కలిపితే సహించబోం..
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా.. కార్పొరేషన్లో కలిపితే సహించేది లేదని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు నెలకు రూ. 6 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పదకొండో పీఆర్సీని అమలు చేయాలన్నారు.