దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో భాగంగా నేడు గోరవయ్య గాదిలింగ గొలుసు తెంపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. కర్నూలు జిల్లా హోలాగుంద మండలం దేవరగట్టులో కొలువైన మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలలో కర్రల సమరం తర్వాత అంతే ముఖ్య ఘట్టం గోరవయ్య గొలుసు తెంపే కార్యక్రమం. అనేక ప్రాంతాలలో ఉన్న గోరవయ్యలు దేవరగట్టుకు వస్తారు. అక్కడ వారు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ ఏడాది బల్లూరు గోరవయ్య గాదిలింగ మూడు సార్లకు గొలుసు తెంపారు. ఈ ఏడాది కాలం బాగుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోరవయ్యల కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
JUDGEMENT: వ్యక్తి హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష