కర్నూలు జిల్లా ఆదోనిలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వినాయక నవరాత్రి ఉత్సవాలు చేయాలని ఆదోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. దేవాలయాలు, ఇళ్లలో మాత్రమే కేవలం రెండు అడుగుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించి పూజలు చేయాలని కోరారు. వీధుల్లో ఎక్కడా విగ్రహ ప్రతిష్ట చేయకూడదని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఉత్సవ కమిటీ, అధికారుల సూచనలు పాటిస్తూ వినాయక చవితి పూజలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణపతి నిమజ్జనం సామూహికంగా కాకుండా ఐదు రోజుల వ్యవధిలో ఎప్పుడైనా చేయొచ్చని సూచించారు.
ఆదోని పట్టణంలో జరిగిన గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో కమిటీ నిర్వాహకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: అర్హులకు చేరని బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు