కర్నూలులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. కేసీ కాలువ వద్దనున్న వినాయక ఘాట్ వద్ద గణనాథుడికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభుపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సంవత్సరం చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసినందున చేతుల మీదుగానే నిమజ్జనం చేస్తున్నారు.
ఇదీ చూడండి