ETV Bharat / state

కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు - corona effect on kurnool

కరోనాపై ప్రజలకు ఉన్న భయాన్ని కొందరు ఆసరాగా చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. కరోనా పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు.

Fraud in the name of Corona .. Three arrested
కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు
author img

By

Published : Aug 27, 2020, 5:45 PM IST

కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు

ఈనెల 22న కర్నూలుకు చెందిన సాయినాథ్ రావు కర్నూలు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబసభ్యులకు కరోనాతో సాయినాథ్ చనిపోయాడని ఆసుపత్రిలో పనిచేసే వార్డు బాయ్ వెంకటగిరి, స్వీపరు జయరాజు తెలిపారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాయినాథ్ కు అంత్యక్రియలు చేసేందుకు.. వార్డు బాయ్, స్వీపరు 91 వేల రుపాయలు డిమాండ్ చేశారు.

ఆస్ట్రేలియాలో ఉన్న మృతుడి కుమారుడు.. 50 వేల రూపాయలు ఫోన్ పే చేయగా... మిగిలిన డబ్బును కర్నూలులో ఉన్నవారు అంబులెన్స్ డ్రైవర్, వార్డు బాయ్, స్వీపర్​కు ఇచ్చారు. మోసం జరిగిందని గుర్తించిన సాయినాథ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మోసానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు అంబులెన్స్​ను, 60వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తబ్రేజ్ తెలిపారు.

ఇదీ చదవండి:

రాజధాని రైతుల పిటిషన్​పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.