కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన రైతులు ప్రభాకర్, హనుమప్ప, నాగరాజు తదితరులు మంగళవారం తాము పండించిన పంటను అమ్ముకునేందుకు కర్నూలు మార్కెట్ వెళ్లారు. అయితే తూకాల్లో మోసానికి పాల్పడుతున్నారని వారు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి మోసాలు ఇకనైనా జరగకుండా చూడాలని మొర పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ